• 2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు

    Sree Viswavasu Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu

     

    • ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించిన వారు మకర రాశి కి చెందును.
    • శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం- 08, వ్యయం- 14, రాజ పూజ్యం- 04, అవమానం- 09
    • పూర్వ పద్దతి లో మకర రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "5". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎదురగు అపవాదులను సూచించుచున్నది. 

    మకరరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా మధ్య మధ్య అనుకూల ఫలితాలు , మధ్య మధ్య ప్రతికూల ఫలితాలు ఎదురగును. 15 మే 2025 వరకు జీవన అభివృద్దికి ఉపయోగకరమైన అతి చక్కటి నూతన అవకాశములు లబించునట్లు చేయును. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు అతి చక్కటి సంతాన యోగం ప్రసాదించును. అన్ని విధములా సంతృప్తికరమైన పరిస్టితులు గురు గ్రహం ప్రసాదిస్తారు. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు ప్రతికూల ఫలితాలు ప్రసాదిస్తారు . కుటుంబ సభ్యుల తో తగాదాల వలన , అధిక ధన వ్యయం వలన మానసిక ప్రశాంతత కొరవడుతుంది. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు ఖర్చు అధికంగా ఉన్నా సమయానికి తగిన ధనం చేతికి లభిస్తుంది. వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ కాలం చాలా అనుకూలమైన కాలం. శరీర బరువు కు సంబందించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోను సూచనలు ఉన్నవి. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు పూర్తిగా ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. ఈ కాలంలో మకరరాశి జాతకులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు.

    మకరరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. మీరు తలపెట్టే నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. నూతన దూర దేశ ప్రదేశాలలో నివాస ప్రయత్నాలు చేయువారికి శని వలన చక్కటి స్టిరత్వం లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు సులువైన ధన సంపాదన లభించును. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని వలన చక్కటి అనుకూలత లభించును. మకరరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

    మకర రాశి వారికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు చక్కటి అనుకూల ఫలితాలు లభించును. అన్ని విధములా జాతకులు సంపూర్ణ ఆయుర్భాగ్యములు అనుభవించును. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు రాహువు వలన కలసి రాదు. తరచుగా ధనానికి ఇబ్బందులు ఎదురగును. వృధా వ్యయాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఆర్ధికంగా ఈ కాలంలో ఆచితూచి వ్యవహరించాలి.

    మకర రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన 18 మే 2025 వరకూ అన్ని విధములా అనుకూల ఫలితాలు ప్రసాదించును. తండ్రి గారి తరపు బంధువులతో మాత్రం ఇబ్బందులు ఎదురగును. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోనుట మంచిది. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు కేతువు వలన కలసి రాదు. ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం మరియు కుజ దోషం కలిగి ఉన్న వారు జీవిత భాగస్వామి సంబంధిత విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. 

    ఏప్రిల్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జాతకులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది కలిగించును. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం ఉండదు. జీవిత భాగస్వామి సంబంధిత బంధు వర్గం వారితో విరోధములు ప్రారంభం అగును. గృహ సంబంధ స్థాన చలన ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. ధనిష్ఠ జన్మ నక్షత్ర జాతకులు మానసిక చాంచల్యత వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ మాసంలో 18, 19 తేదీలలో వాహన ప్రమాద సూచన ఉన్నది. 22 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం ఏర్పడును. కార్యాలయంలో కోరుకున్న సౌకర్యములు లభించును. చివరి వారంలో అన్ని విధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును.

    మే 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో అన్ని విధాలా ఆదాయం బాగుండును. వ్యాపార విస్తరణకు, నూతన ఆలోచనలు అమలు చేయుటకు ఈ మాసం కలసి వచ్చును. విదేశీ ప్రయత్నములు చేయుటకు, వివాహ ప్రయత్నములు - సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఈ మాసంలో 3 వ తేదీ నుండి 15 వ తేదీ మధ్య కాలంలో ఆకస్మిక ప్రయాణములు ఏర్పడును. సోదర సోదరి వర్గీయులకు సంబందించిన ఇబ్బందుల వలన మానసిక చికాకులు. 19,20,21 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో గౌరవ నష్టం. అపవాదులు బాధించును. చివరి వారంలో శారీరక శ్రమ అధికం అగును. నరముల సంబంధిత సమస్యలు ఇబ్బంది కలిగించును.

    జూన్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన విధంగా పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లకు అవకాశములు ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతి - నూతన భాద్యతలు లభిస్తాయి. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కొనసాగును. కుటుంబములో మీ మాట విలువ పెరుగును. విద్యార్ధులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. తృతీయ వారంలో విహార యాత్రలు, విందు - వినోదాల వలన సంతోషంగా సమయం గడచును. జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవనంలో సోఖ్యం. బాగా ఎదిగిన సంతానం వలన ఆర్ధిక లేదా వాహన ప్రయాణ సౌఖ్యం అనుభవిస్తారు. కుటుంబ భాద్యతలను తీసుకొంటారు. స్థిరాస్తి తగాదాలలో రాజీ ప్రయత్నాలు ఫలించును.

    జూలై 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. నూతనంగా ప్రారంభించిన వ్యాపారములో లాభములు పెరుగును. పోటీదారులు తొలగును. గుత్తేదారులకు భారి ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. సంతానానికి కొద్దిపాటి అనారోగ్యం వలన మనస్తాపం. పై అధికారుల సహకారంతో ఉద్యోగ జీవనంలో అనుకూల కాలం. సులువుగా లక్ష్యాలను పుర్తి చేయగలుగుతారు. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు ఎదుర్కొందురు. విదేశీ జీవన సంబంధ ప్రయత్నాలలో జాప్యం చికాకు కలిగించును. నూతన ప్రయత్నాలలో ప్రభుత్వ పరమైన అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి అన్ని విధాల సామాన్య ఫలితాలు పొందుదురు. ఈ మాసంలో 8, 10, 11, 13 తేదీలు అనుకూలమైనవి కావు.

    ఆగష్టు 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు , విందు భోజనములు, అతిధుల ఆతిధ్య సంబంధిత వ్యయం ఎదుర్కొందురు. నూతన పరిచయాలు లాభించును. ఈ మాసంలో ప్రారంభ రోజులలో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు గురు గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ జీవన సంబంధిత శుభవార్త. అందరి మన్ననలను పొందుతారు. మాసాంతంలో ఆశించిన ఫలితాలు ఏర్పడుతాయి. మొత్తం మీద ఈ మాసంలో ఆదాయం కన్నా వ్యయం అధికం అగును.

    సెప్టెంబర్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. నూతన పనులు ఆరంభించకూడదు. నష్ట పరచును. భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ విషయలాలో చికాకులు అధికం అగును. ద్వితియ వారంలో సంతాన సంబంధ లాభం. ధనాదాయం లో కొద్దిపాటి పెరుగుదల ఏర్పడును. కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం. ఆనందకర సమయం. నాలుగవ వారం ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఏర్పడును. తలపెట్టిన పనులలో ఊహించని చికాకులు. ప్రయాణమూలక ఆరోగ్య సమస్యలు ఎదురగును.

    అక్టోబర్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ప్రధమ అర్ధ భాగంలో ఇష్టమైన వ్యక్తులతో దూర ప్రయాణములు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు చేయగలుగుతారు. పుత్ర సంతానం వలన చక్కటి సౌఖ్యత ఏర్పడును. ద్వితియ అర్ధ భాగం నుండి అనగా 13, 14, 15, 16 తేదీలలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం ఏర్పడు సూచనలు అధికం. చిన్న చిన్న విషయాలలో ఇరుగు పొరుగు వారితో తగాదాల వలన చికాకులు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు. 17,18 తేదీలలో గౌరవ హాని. మాసాంతంలో ఉద్యోగ ఒత్తిడి వలన శ్రమ అధికం అగును. వివాహ సంబంధ ప్రయత్నాలలో ఒక అశుభ వార్త.

    నవంబర్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో నూతన ప్రారంభాలకు ఆశించిన ఋణాలు లభించును. శరీర ఆరోగ్యం కొంత ఇబ్బందులు కలుగచేయును. 14 వ తేదీ వరకూ ప్రయత్నములు సులువుగా విజయవంతం అగును. 14 వ తేదీ తదుపరి అతి కష్టం మీద కార్య విజయం ఏర్పడును. వ్యాపార విస్తరణకు 14 వ తేదీ తదుపరి అనుకూలమైన సమయం కాదు. ఈ మాసంలో పనులు పూర్తి అవడానికి మధ్యవర్తుల పై ఆదరాపడకండి. అలసత్వం పనికిరాదు. కోర్టు వ్యవహారములు వాయిదా తీసుకోండి. గృహ వాతావరణంలో జీవన సంతోషములు మధ్యమం. ఈ నెలలో 18,25,30 తేదీలు మంచివి కావు. 5,6 తేదీలలో వివాహ ప్రయత్నములకు అనుకూలం. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం.

    డిసెంబర్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం కొంచం తగ్గును. వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. ఆధార పడిన వారి నుండి సహకారము లభించదు. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం ఎదురగును. తృతీయ వారంలో దైవదర్శన, పుణ్య క్షేత్ర సందర్శన ఫలితం ఏర్పడును. 21 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలలో శుభ వార్త. మాసాంతమునకు ఉద్యోగ పరిస్టితులలో కొంచం ప్రశాంతత లభించును. ఈ నెలలో 5,14,20,29 తేదీలు మంచివి కావు. ఈ తేదీలలో చేయు ప్రయాణములందు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ తేదీలలో స్థిరాస్తి క్రయవిక్రయాలు కలసిరావు.

    జనవరి 2026 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో చేయు ప్రయత్నములలో ప్రారంభమున ఆటంకములు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం లభించును. ధనాదాయం నెమ్మదిగా పెరుగును. గతకాలపు ఇబ్బందులు క్రమంగా తొలగును. ద్వితియ , తృతీయ వారములలో నూతన ఆదాయ మార్గములకై చేయు ప్రయత్నాలు లాభించును. కళత్ర మూలక ధనలాభం ఏర్పడును. వ్యక్త్రిగత జీవనంలో సౌఖ్యం. దూరపు బంధువులతో కలయిక వలన లాభం. 24 వ తేదీ తదుపరి వ్యాపారంలో గొడవలు. మానసిక అశాంతి. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలమైన మాసం కాదు.

    : ఫెబ్రవరి 2026 మకర రాశి రాశిఫలాలు

    ఈ మాసంలో చక్కటి ఆదాయమునకు సూచనలు కలవు. కెరీర్ పరంగా ఉన్నతి పొందుతారు. పెద్ద వయస్సు వారికి శరీర అరోగ్యం సహకరించదు. గత కాలపు పెట్టుబడుల నుండి రాబడి ప్రారంభమగును. పశు సంబంధ హాని పొందుటకు సూచనలు ఉన్నవి. 14, 15, 16, 17 తేదీలలో కార్యానుకులత ఏర్పడును. ప్రభుత్వ రంగ ఉద్యోగం చేయువారికి వారికి చాలా అనుకూలమైన కాలం. గృహంలో మార్పులు చేయుటకు ఇది మంచి సమయం. 26, 27, 28, 29 తేదీలలో చేయు దూర ప్రాంత నివాస ప్రయత్నములు లాభించును. ఆలోచనలు సక్రమ మార్గంలో ఉంటాయి. అభివృద్ధికర జీవనం ఏర్పడుతుంది.

    మార్చ్ 2026 మకర రాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పూర్తి చేయవలసిన పరిస్థితులు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. నూతన ప్రయోగాలు చేయుటకు ఇది మంచి కాలం. ఉన్నత పదవులు పొందటానికి ఇది యోగావంతమైన కాలం. నూతన పారితోషకాలు అందుకోను సూచనలున్నాయి. చివరి వారంలో ఆరోగ్య సమస్య లేదా శస్త్ర చికిత్స జరుగు అవకాశం కలదు.