2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు

Sree Viswavasu Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu

 

Placeholder image

 

మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.

2025 - 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 01, అవమానం - 03 

 

పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి విజయవంతమైన సంవత్సరాన్ని సూచిస్తున్నది.

వృషభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. 15 మే 2025 వరకు జీవితంలో మంచి యోగవంతమైన కాలం ఏర్పరచును. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, జీవన విధానంలో ఉన్నతి పొందడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విద్యార్దులకు అతి చక్కటి విజయాలు ప్రాప్తించును. శరీర దారుడ్యత, ఆరోగ్యం కోసం ఆలోచించడం మొదలు పెడతారు. చెడు వ్యసనాల నుండి బయట పడతారు. గ్రంధ రచన చేయాలనే సంకల్పం కలిగిన వారికి ఈ కాలం అనుకూలమైనది. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు సంతాన లాభములు పొందుటకు అనుకూలమైన కాలం. వివాహ ప్రయత్నాలకు కూడా గురు గ్రహ బలం తోడగును. కుటుంబ సంబంధ సంతోష సమయాలు, బందు వర్గ కూడికలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ముఖ్యంగా 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు సోదర సోదరి వర్గం వారి వలన బాగా లాభపడతారు. వారి వలన యోగవంతమైన జీవనం అనుభవిస్తారు. భాత్రు వర్గంతో ఏర్పడి ఉన్న సమస్యలు అన్నీ సమసిపోతాయి. తగవులందు రాజీ ప్రయత్నాలకు ఈ కాలం అత్యంత అనుకూలమైనది. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఆర్ధికంగా చాలా బాగుంటుంది. ఆశించిన విధంగా ధన సంపదలను నిలువ చేసుకోగలరు. గృహ లేదా భూ సంపదలను ఏర్పరచుకోవడానికి అనువైన కాలం. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గురు గ్రహం వృషభ రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ప్రసాదించును.

వృషభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రాంత చలనం లేదా పర దేశములందు పౌరసత్వం కొరకు ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూల కాలం. లోహములు, నల్లని రంగు వస్తువుల సంబంధ వ్యాపారాలు, వ్యవసాయం  చేయు వారికి ఈ సంవత్సరం అతి చక్కటి లాభములు కలుగ చేయును. విహార యాత్రలు చేయదలచిన వారి మనోవాంచ నెరవేరును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. మొత్తం మీద

 ఈ సంవత్సరం వృషభ రాశి వారు శని గ్రహం వలన అనేక విధముల లాభపడతారు.

వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన కూడా అతి చక్కటి లాభములు ఏర్పడతాయి. 18 మే 2025 వరకు సులువైన ధనార్జన కలుగ చేయును. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆర్ధికంగా, హోదా పరంగా లాభములు ఏర్పరచును. నూతన వాహన సౌఖ్యం ప్రసాదించును. 19 మే 2025 నుండి ఉద్యోగ జీవనంలో కోరుకున్న మార్పులు ప్రసాదించును. ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొనునట్లు చేయును. ఆర్ధికంగా యోగించును. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారు రాహు గ్రహం వలన పూర్తిగా అనుకూల ఫలితాలు పొందుతారు. 

వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన లాభ వ్యయాలు సమానంగా ఎదురగును. వ్యక్తిగత జాతకంలో కేతు గ్రహ బలం పూర్తిగా లోపించి సంతాన ప్రయత్నములు చేయు వారు నిరాశాజనక ఫలితాలు పొందుతారు. మిగిలిన అన్ని విషయాలలో కేతువు వృషభ రాశి వారికి సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ప్రసాదించును.

  • ఏప్రిల్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. కానీ మానసిక ప్రశాంతత కోరవడును. మనోధైర్యాన్ని కోల్పోవు సంఘటనలు ఎదురగు సూచన. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం లభిస్తుంది. ద్వితీయ వారంలో యువకులు అప్రయత్నంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకొందురు. ఉద్యోగులకు శారీరక శ్రమ పెరుగును. ఈ మాసంలో అతి ధైర్యంతో ఆలోచనలు చేయకుండా ఉండుట మంచిది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగునట్టు వ్యవహరించుట అవసరమగును. చివరి వారంలో శైవ సంబంధ పుణ్యక్షేత్ర సందర్శన చేయుట మంచిది.
  • మే 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో ధన సంబంధ విషయాలు ప్రతికూలంగా ఉండును. ఉద్యోగ జీవనములో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడు సూచన. ఆరోగ్య పరంగా ముత్ర సంబంధ సమస్యలు, శిరోబాధ బాధించు సూచన. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. చేపట్టిన పనులు , నూతన ఆరంభములు ప్రతిఘటనలతో కొనసాగును. ఇతరుల సహాయ సహకారాలకోసం ఎదురుచుడవలసి వస్తుంది. ఈ మాసంలో సహనంతో వ్యవహరించుట అన్ని విధాల మంచిది. ఈ మాసంలో 16, 20, 23, 29 తేదీలలో ఆర్ధిక - ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండుట మంచిది.
  • జూన్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. కాని నూతన వ్యవహారాలు, వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం సమస్యలు ఎదుర్కొనును. జీవిత భాగస్వామి బంధువులతో శతృత్వం ఏర్పడు సూచన ఉన్నది. వ్యక్తిగత జీవనంలో కొద్దిపాటి సమస్యలు. కుటుంబ బంధాలపై నమ్మకం దెబ్బతినును. చేపట్టిన పనులను మధ్యలోనే వడిచిపెట్టుదురు. వ్యతిరేక ఫలితాల వలన ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కుల వృత్తులపై ఆధార పడిన వారికి తీవ్ర సమస్యలు. ఋణ బాధలు. తృతియ , చతుర్ధ వారములలో సంతాన సంబంధ శుభ వార్త. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలమైనది కాదు.
  • జూలై 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో ఆర్ధిక విషయాలు కొంత బాగుంటాయి. వ్యాపారములలో ఆదాయం గత రెండు మాసాల కన్నా పెరుగుతుంది. చక్కటి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి జాతకులు ఉద్యోగ రీత్యా చేయు స్థాన చలన ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆశించిన ధనాదాయం లభించును. వృధా వ్యయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగ జీవనం వారికి ప్రధమ, ద్వితీయ వారాలలో కొన్ని పొరపాట్లు చేయుట వలన ఇబ్బందులు ఉన్నాయి. ఏకాగ్రతతో పనిచేయాలి. కుటుంబ బంధాలపై సక్రమమైన ఆలోచన అవసరం. రక్త సంబంధాల విలువ అర్ధం చేసుకోవాలి. ఈ మాసంలో 16 నుండి 19 వ తేదీల మధ్య కాలం కుటుంబ విషయాలకై చర్చించుటకు మంచి రోజులు.
  • ఆగష్టు 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం పొందగలరు. నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగును. కుటుంబ విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు అవగాహన అవుతాయి. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. జీవితానికి సంబందించిన ముఖ్యమైన నిర్ణయాలను ఈ మాసంలో తీసుకొనవచ్చు. ఈ మాసం లో తీవ్ర వ్యక్తిగత ఇబ్బందుల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • సెప్టెంబర్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఏర్పరుస్తుంది. పట్టుదలకు పోయి వ్యవహారాలను పాడు చేసుకొంటారు. మిత్రుల మాట అతిగా విని నష్టపోతారు. దురలవాట్ల వలన ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఎదో ఒక విధంగా అవసరాలకు తగిన ధనం మాత్రం సర్దుబాటు అవుతుంది. ప్రారంభించిన నూతన వ్యవహారాలు ప్రభుత్వ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ద్వితీయ మరియు తృతీయ వారములలో కుటుంబంలో ఒక తీవ్ర నష్టం ఏర్పడుటకు సూచన ఉన్నది. ఈ మాసంలో ప్రయాణ మూలక ఆరోగ్య సమస్యలు మరియు ఆశా భంగములు ఏర్పడును. మాసం చివరిలో భాగస్వామ్య వ్యవహారాలలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుంటారు.
  • అక్టోబర్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. చివరి వారానికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. సంతాన ప్రయత్నాలు చేయువారు అశుభ వార్త తెలుసుకొను సూచనలు ఉన్నవి. ఉద్యోగ వ్యవహారాలలో నూతన అవకాశములు లభిస్తాయి. విద్యార్దులకు ఒత్తిడి అధికమగును. నిద్రలేమితనం బాధిస్తుంది. ఆర్ధిక విషయాలలో ఆశించిన సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఈ మాసంలో మిత్రులతో సంభాషించునపుడు ఆచి తూచి మాట్లాడాలి. ఆర్ధిక పరంగా మిత్రులకు ఆలోచించకుండా హామీలు ఇవ్వకూడదు.
  • నవంబర్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసం బాగుంటుంది. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘములో గౌరవం లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్ధుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో అవివాహితులు తమ జన్మ స్థానానికి ఉత్తర దిశగా వివాహ ప్రయత్నాలు చేయడం వలన కలసి వచ్చును. స్త్రీ లకు నూతన వస్తు - ఆభరణాలు లభించు సూచనలు ఉన్నవి. ఈ మాసంలో శుభ వార్తలు వినుట వలన పోయిన మనోధ్యైర్యం తిరిగి పొందుతారు. ఆశించిన విధంగా దైవం నుండి సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఈ మాసం సౌఖర్యవంతంగా ఉంటుంది.
  • డిసెంబర్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో కూడా అనుకూల కాలం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులు చేస్తారు. నూతన వస్తువులను ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో సౌఖ్యం ఏర్పడుతుంది. ధన సమస్యల నుండి బయటపడతారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీర్తి పెరుగుతుంది. రాజకీయ పరంగా కూడా ఆశించిన సహకారం లభిస్తుంది. సాంకేతికంగా నూతన పరిజ్ఞానం సంపాదించుకొంటారు. కుటుంబ ప్రయాణాలకు సిద్ధం అవుతారు. ఈ మాసంలో 2, 7, 21, 28, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
  • జనవరి 2026 వృషభరాశ ిరాశిఫలాలు: 
  • ఈ మాసంలో ధనాదాయం బాగుండును. సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపెదురు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. దూరప్రాంత జీవన ప్రయత్నాలు విజయమగును. కుటుంబానికి నూతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆశించిన విధంగానే వ్యవహారాలు కొనసాగుతాయి. పనిచేయు కార్యాలయంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15 వ తేదీ నుండి 18వ తేదీ మధ్య కాలంలో పాద సంబంధ వ్యాధులకు అవకాసం ఉన్నది. వివాహ ప్రయత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.
  • ఫెబ్రవరి 2026 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో అదృష్ట యోగం ఉన్నది. హోదాలో పెరుగుదల ఆశించవచ్చు. గ్రంధ రచన లేదా ముద్రణా రంగంలోని వారికి ఈ మాసం విశేషమైన ఆర్ధిక లాభాన్ని ఏర్పరచును. ప్రమాదాల నుండి బయటపడతారు. అపోహలు తొలగుతాయి. మనస్తాపం కలిగించే మనుషుల నుండి దూరం కాగలుగుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులకు సహకరించగలరు. నూతన అవకాశముల అన్వేషణ ఫలిస్తుంది. విద్యార్ధులకు మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది.
  • మార్చ్ 2026 వృషభరాశి రాశిఫలాలు: 
  • ఈ మాసంలో ఆశించిన పనులు కార్యరూపం దాల్చును. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనాలలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఉన్నత వర్గీయుల పరిచయాలు ఏర్పడుతాయి. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి అననుకుల ఫలితాలు ఎదురగును. జీవిత భాగస్వామితో చికాకులు. ధనాదాయం బాగుండును. పెద్దవయస్సు వారికి కుడి నేత్ర సంబంధ సమస్యలు బాధించును.
  • మీ సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు...
  • వృషభరాశి స్వభావం...
  • కృత్తిక జన్మ నక్షత్ర స్వభావం...
  • రోహిణి జన్మ నక్షత్ర స్వభావం...
  • మ్రిగశిర జన్మ నక్షత్ర స్వభావం...
  • ఇతర రాశుల 2025 - 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశీ ఫలాలు